Telangana : ఎల్లుండి నుంచి హెల్త్ వీక్: మంత్రి రాజనర్సింహ

ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు

Update: 2026-04-05 03:19 GMT

తెలంగాణ లో ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు 'హెల్త్ వీక్' నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. వారం రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు ఉంటాయని మంత్రి రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమాలివీ...
ఈ నెల 6న ఉదయం నెక్లెస్‌ రోడ్డులో ఈట్‌ రైట్ వాక్, మధ్యాహ్నం నేచురోపతిలో మిల్లెట్ మేళా జరుగుతాయి. 7వ తేదీన 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందజేయడంతో పాటు, కేన్సర్ రిజిస్ట్రీని మంత్రి ప్రారంభించనున్నారు. నిమ్స్‌లో ఎల్ఐఎన్ఏసీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.


Tags:    

Similar News