ధన త్రయోదశి : లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ?

రాత్రి 10.30 గంటల సమయంలో మళ్లీ స్నానమాచరించి.. ఆవునెయ్యితో లక్ష్మీదేవి ఫొటో ముందు దీపాన్ని వెలిగించాలి.

Update: 2022-10-21 14:23 GMT

Dhanatrayodashi

దీపావళి అంటే మూడ్రోజుల పండుగ. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ధనత్రయోదశి రోజున చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తుంటారు. ధనత్రయోదశి రోజు ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎలాంటి ఉంగరాన్ని ధరిస్తే.. ధనలాభం కలుగుతుందో తెలుసుకుందాం.

అక్టోబర్ 23న ధన త్రయోదశి. ముందురోజే కంసాలి వద్ద ప్లెయిన్ వెండి ఉంగరాన్ని తయారు చేయించుకోవాలి. ఆదివారం ఆ ఉంగరాన్ని స్వచ్ఛమైన తేనె సీసాలో వేసి దేవుడి మందిరంలో ఉంచాలి. దీపావళి రోజున సాయంత్రం పూజ అయిన అనంతరం.. రాత్రి 10.30 గంటల సమయంలో మళ్లీ స్నానమాచరించి.. ఆవునెయ్యితో లక్ష్మీదేవి ఫొటో ముందు దీపాన్ని వెలిగించాలి. తేనె సీసాలో ఉంచిన వెండి ఉంగరాన్ని ఆవునెయ్యితో వెలుగుతున్న దీపపు ప్రమిదలో వేయాలి. అనంతరం లక్ష్మీదేవిని కుంకుమతో అలంకరించి.."శ్రీం శ్రీయై నమః" మంత్రాన్ని 1000 సార్లు జపించాలి.
మర్నాడు ఉదయం స్నానమాచరించి.. నేతిలో ఉంచిన ఉంగరాన్ని శుభ్రంగా కడిగి కుడిచేతికి ఉన్న ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. అనంతరం.. ఉంగరాన్ని ఉంచిన తేనెను పచ్చని చెట్లు ఉన్న చోట పోయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందటమే కాకుండా.. మళ్లీ ధనత్రయోదశి వరకూ ధనవృద్ధి, ధనలాభం చేకూరుతాయి.


Tags:    

Similar News