Diwali : దీపావళికి నోములు నోచుకోవాలా? కొత్త వారు కూడా చేసుకోవచ్చా?

దీపావళికి ప్రత్యేకంగా నోములు నోచుకుని లక్ష్మీదేవిని ప్రార్ధించడం సంప్రదాయంగా వస్తుంది

Update: 2023-11-10 12:49 GMT

దీపావళి కేవలం టపాసులు పండగే కాదు. మహిళలకు నోముల పండగ కూడా. దీపావళికి ప్రత్యేకంగా నోములు నోచుకుని లక్ష్మీదేవిని ప్రార్ధించడం సంప్రదాయంగా వస్తుంది. ఈసారి ఆదివారం రావడంతో మహిళలు ఈ నోములు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారమే నోములు నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య సోమవారం మధ్యాహ్నం వరకూ ఉండటంతో ఆదివారమే నోములు చేసుకోవడమే మంచిదని పండితోత్తములు చెబుతున్నారు.

స్వాతి నక్షత్రం కావడంతో...
పంచాంగకర్తలు కూడా ఇదే చెబుతున్నారు. ఇక ఈ ఏడాది స్వాతి నక్షత్రంలో వచ్చింది కాబట్టి కొత్తవారు కూడా నోములు నోచుకోవచ్చని పురోహితులు చెబుతున్నారు. కొత్త వారు ఈ ఏడాది నోములు నోచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే మహిళలు నోములు నోచుకుంటారు. బంధువులను పిలిచి లక్ష్మీదేవికి పూజలు చేసి, నోములు నోచుకుని బంధుమిత్రులకు భోజనాలు పెడతారు. అందరూ ఆనందంగా గడుపుతారు.
వ్యాపారస్థులు...
తెలంగాణలో దీపావళి సందర్భంగా కేదారీశ్వరి వ్రతం కూడా చేసుకుంటారు. ఈ వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటుండదని విశ్వసిస్తారు. అందుకే కేదారీవ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా మహిళలు లక్ష్మీపూజలు చేసుకుంటారు. దీపావళి రోజు సాయంత్రం వ్యాపారులు లక్ష్మీపూజలు నిర్వహించి కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఇది మార్వాడీలు ఎక్కువగా చేస్తుంటారు. ఆ రోజు నుంచే వారికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని భావిస్తారు. ఇలా అందరూ ఆనందంగా నోములు చేసుకుని సాయంత్రానికి టపాసులు పేల్చుకుని దీపావళి పండగను చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది.


Tags:    

Similar News