కడపలో టెన్షన్.. ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
కడప జిల్లా ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది.
కడప జిల్లా ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి హత్య చేశాడు. యువకుడు శ్రీనివాస్ ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఆందోళనకుదిగిన...
అయితే వెంటనే యువతని కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌కు తరలిస్తుండగా.. దారిలోనే యువతి మృతి చెందింది. నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ ను తమకు అప్పగించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు