మసాజ్ సెంటర్ పై దాడి.. ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అందిన సమాచారం మేరకు దాడి చేయడంతో అక్కడ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం కొనసాగుతున్నట్లు గుర్తించారు. దాడి చేసిన సమయంలో కొందరు యువతులతో పాటు యువకులు ఉన్నట్లు గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమచారంతో...
బంజారాహిల్స్ రోడ్డు నెం 12లో మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తూ వ్యభిచారం చేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ యజమానితో పాటు ఒక యువకుడిని, కొందరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.