ఘోర ప్రమాదం...ఏడుగురి సజీవ దహనం
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లఖ్తర్ ప్రాంతంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఐదుగురు మహిళలు...
మృతుల్లో ఐదుగురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు రావడంతో కారులో ఉన్నవారంతా సజీవ దహనమయ్యారు. కారులో ఉన్నవారు బయటకు రాలేక మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.