ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మృతి?
ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారీగా మావోయిస్టుల మరణించారు.
ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారీగా మావోయిస్టుల మరణించారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారని తెలిసింది. మావోయిస్టుల ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నంబాల కేశవరావు అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. విశాఖలో మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు. నంబాల కేశవరావు తలపై కోటిన్నర రివార్డు ఉంది. గణపతి రాజీనామాతో మావోయిస్టు చీఫ్ గా నంబాల కేశవరావు బాధ్యతలను తీసుకున్నారు. మృతుల్లో నంబాలతో పాటు మరికొందరు కీలక నేతలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించలేదు. నంబాల శంకరరావు బలిమెల ఘటనలో కీలక పాత్ర పోషించారు.
ఇరవై ఎనిమిది మంది వరకూ...
నారాయణపూర్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తుంది. మరికొందరికి గాయాలయ్యాయి. ఛత్తీస్ గఢ్ లోని మాడ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు ఉన్నారని తెలిసింది. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ తో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది.