బ్రేకింగ్ : గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడికి ఉరిశిక్ష

ఈ కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న

Update: 2022-04-29 10:08 GMT

గుంటూరు : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న ఉదయం 9.30 గంటల సమయంలో నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా బీటెక్ విద్యార్థిని ఎన్ రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె గొంతుపైన, ఉదరం పొన 8 సార్లు అత్యంత దారుణంగా పొడిచి చంపాడు శశికృష్ణ.

హంతకుడు తొలుత ఇనస్టాగ్రామ్ లో, ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా రమ్యతో పరిచయం పెంచుకుని, ఆమెను ప్రేమపేరుతో వేధించడం మొదలు పెట్టాడు. శశికృష్ణ అసలు రూపం తెలియ రమ్య అతనికి ఫోన్ నంబర్ ఇవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దాంతో రమ్య అతని మొబైల్ నంబర్ ను బ్లాక్ చేసింది. తన నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో కోపంతో రగిలిపోయిన శశికృష్ణ.. ఆగస్టు 15 వతేదీ ఉదయం ఆమె ఇంటి సమీపంలో నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా అనేక మంది చూస్తుండగా పొడిచి చంపాడు. అక్కడున్నవారిలో ఎవరూ ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు సాహసించలేదు.
రమ్య హత్య జరిగినప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా గుంటూరు స్పెషల్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా శశికృష్ణను ఉరితీయాలని కోరారు. కాగా.. శిక్ష పడిన హంతకుడు పైకోర్టులను ఆశ్రయించినప్పటికి ఈ శిక్షలో మరో మార్పు వుండే అవకాశాలు లేవని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి నిందితులు శిక్షనుంచి తప్పించునేందుకు ఉన్న లొసుగులను కూడా చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News