Maharashtra : మహారాష్ట్రలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు మరణించారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు మరణించారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పై కప్పు కూడా కూలిపోయింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరగడంతో కార్మికులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మరికొందరికిగాయాలయ్యాయి.
పన్నెండు మందిలో...
ప్రమాదం జరిగిన సమయంలో పన్నెండు మంది ఫ్యాక్టరీలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేలుడు ధాటికి ఐదు కిలోమీటర్ల వరకూ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.