Ys Jagan : నేడు కడప జల్లాకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 11.45 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భాకరాపురంలోని తన నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
రెండు రోజుల పాటు...
వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రాత్రికి పులివెందులలోనే బస చేస్తారు. రేపు ఉదయం 9.50 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా నిర్మించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభింనున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు జగన్ పులివెందులలో పర్యటిస్తుండటంతో పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.