ఒకటోతేదీ .. పెన్షన్ ఇంటి వద్దకే

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ ను పేదలకు అందిస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ను అందచేస్తున్నారు.

Update: 2022-04-01 02:46 GMT

ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పెన్షన్ ను పేదలకు అందిస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ను అందచేస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు నెల మొదటి రోజు కావడంతో పెన్షన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు తెల్లవారు జాము నుంచే క్యూకట్టారు.

వాలంటీర్ల ద్వారా.....
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఆంధ్రప్రదేశ్ లో 61.03 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఇప్పటికే 1551. 16 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్దిదారులకు పెన్షన్ అందచేయడంలో విధుల్లో ఉన్నారు.


Tags:    

Similar News