వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా జగన్ ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరు ఆయురోర్యాగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని తాను కోరుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్ వేదికగా...
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పారు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పండగ రోజు శుభాకాంక్షలని తెలిపారు.