Ys Jagan : నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ
నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించనున్నారు
నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి తో పాటు మావిగన్ అంశంపై కూడా జగన్ నేడు వైసీపీ నేతలతో సమావేశమై చర్చించనున్నారు. ముఖ్యనేతలకు ఇప్పటికే ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది.
పార్టీ బలోపేతంపై...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమై మావిగాన్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు..