Andhra Pradesh : ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది

Update: 2026-04-07 04:21 GMT

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశమున్నందున పొలాలకు వెళ్లే పశువుల కాపర్లు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారరు.

ఈ జిల్లాల్లో వానలు...
వాతావరణ శాఖ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News