Ys Jagan : నేడు ఇడుపులపాయకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు

Update: 2025-09-02 02:36 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. నిన్ననే పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

వివిధ కార్యక్రమాల్లో...
ఈరోజు వైఎస్ జగన్, భారతితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పెలివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. ఈరోజు వైఎస్సార్ వర్ధంతి కావడంతో పులివెందులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.


Tags:    

Similar News