ఇంటి భోజనం .. ములాఖత్ ల కోసం మిధున్ రెడ్డి

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

Update: 2025-07-21 04:17 GMT

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 4 ఎ నిందితుడిగా మిధున్ రెడ్డి ఉన్నారు. అయితే తాను వీఐపీ కావడంతో తనకు ఇంటి భోజనం అందివ్వాలని మిధున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు.

ఏసీబీ కోర్టులో పిటీషన్...
రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్యారక్ లో మిధున్ రెడ్డిని ఉంచారు. తనకు ఇంటి భోజనం అందించాలని, అలాగే తన ములాఖత్ ల సంఖ్యలను పెంచాలంటూ ఏసీబీ కోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు రాజమండ్రి జైలు నుంచి వివరాలను తెప్పించుకున్న తర్వాత అనుమతులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోనుంది.


Tags:    

Similar News