Ys Jagan : నేడు సత్యసాయి జిల్లాకు జగన్

వైసీపీ అధినేత జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-05-13 01:32 GMT

వైసీపీ అధినేత జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇటీవల మరణించిన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మురళీ నాయక్ పాక్ సైనికుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి ఉదయం 1.30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు జగన్ చేరుకుంటారు.

మురళీ నాయక్ కుటుంబాన్ని...
మురళీ నాయక్ తల్లిదంద్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. జగన్ పర్యటన సందర్భంగా పెద్దయెత్తును పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరిగి బెంగళూరుకు పయనమయి వెళతారు. వైసీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.


Tags:    

Similar News