మురళి నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థికసాయం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీ సత్య సాయి జిల్లాలో పర్యటించారు. వీర జవాన్ మురళినాయక్ కుటుంబాన్ని పరామర్శించారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీ సత్య సాయి జిల్లాలో పర్యటించారు. వీర జవాన్ మురళినాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
భరోసా కల్పించి...
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూకాశ్మీర్ లో పాక్ సైనికుల కాల్పులలో మురళీ నాయక్ మరణించారు. బెంగళూరు నుంచి మురళినాయక్ కు స్వగ్రామానికి చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి భరోసా కల్పించారు. మురళి నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తర్వాత ఆయన తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.