కృష్ణానదికి పోటెత్తుతున్న వరద.. నిండుతున్న జలాశయాలు

నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

Update: 2025-05-29 05:52 GMT

నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు దంచి కొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు రావడంతోవర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో మే నెలలో కురిసిన అకాల వర్షాలు చెరువులు, నదులు ఎండిపోతున్నాయి. కొన్ని రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర,కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కృష్ణా నది పై ఉన్న జూరాల డ్యామ్ శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది.

జూరాల ప్రాజెక్టుకు...
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు కు గత మూడు రోజులుగా వరద నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం ఇన్ ఫో 3,258 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. కంటిన్యూగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.490 మీటర్లకు చేరుకుంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంలీలు కాగా.. ప్రస్తుతం 5.928 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న వరద ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో జూరాల డ్యామ్ పూర్తి స్థాయికి నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉప నదులకు వరద నీరు పోటెత్తడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం జులై నెలలో వరద ప్రారంభం అవ్వనుండగా ఈ సారి అకాల వర్షాల కారణంగా ముందస్తుగానే శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చి చేరుతుంది. నిన్న ఉదయానికి ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల వరద వస్తుండగా 19,070 క్యూసెక్కులు ఔట్ ఫ్లో దిగువకు వెళ్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ముందస్తుగానే వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద కంటే దిగువకు వెళ్తున్న ఔట్ ఫ్లో అధికంగా ఉందని అధికారులు తెలిపారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణలలో ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి.


Tags:    

Similar News