సమ్మెకు మేం మద్దతివ్వట్లేదు : ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం

ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపగా.. ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మాత్రం తాము

Update: 2022-02-03 08:44 GMT

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య పీఆర్సీ పంచాయితీ రోడ్డుకెక్కుతోంది. "ఛలో విజయవాడ" అంటూ ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించగా.. దానిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఉద్యోగులు పక్కా ప్రణాళికతో గుంపులు గుంపులుగా మారు వేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. ఈ సమ్మెకు పలు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపగా.. ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మాత్రం తాము సమ్మెలో పాల్గొనడం లేదని పేర్కొంటూ మంత్రి సజ్జలకు లేఖ ఇచ్చారు సంఘం నేతలు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమకు మంచే చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నా జీతాలు సక్రమంగా ఇచ్చారని, ఇలాంటి మంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో తాము పాల్గొనబోమని తెలిపారు.




Tags:    

Similar News