వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు
వల్లభనేని వంశీ కేసు కీలక మలుపు తిరిగింది. విజయవాడ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు
వల్లభనేని వంశీ కేసు కీలక మలుపు తిరిగింది. విజయవాడ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసుల మెమో దాఖలు చేశారు. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు మెమో దాఖలు చేశారు. అయితే వల్లభనేని వంశీ కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారనుంది. న్యాయస్థానంలోలో సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు.
సోమవారం స్టేట్ మెంట్ రికార్డు...
సోమవారం సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. వల్లభనేని వంశీ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి కోర్టులో బలవంతంగా ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసేందుకు వంశీ బెదిరింపులు, కిడ్నాప్ కు పాల్పడ్డారన్న దానిపై వల్లభనేని వంశీపై కేసు నమోదయింది.