అందుకే విశాఖ రైల్వే జోన్ రాలేదు...ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆగ్రహం
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. విశాఖ రైల్వేజోన్ ఆలస్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆయన తెలిపారు. ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సహకరించలేదన్న అశ్వనిీ వైష్ణవ్ భూమి కేటాయిస్తే కదా? జోన్ ఏర్పాటయ్యేది అంటూ ఎదురు ప్రశ్నించారు.
52 ఎకరాల భూమి....
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు 53 ఎకరాలు కావాలని, కానీ రైల్వేజోన్‍కు అవసరమైన భూమిని ఏపీ సర్కార్ ఇంత వరకూ అప్పగించలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే తామేం చేస్తామని ప్రశ్నించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక వచ్చిందని, భూమి ఉంటేనే కదా పనులు ప్రారంభించేది అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.