విశాఖస్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనవాసవర్మ ఏమన్నారంటే?

విశాఖ స్టీల్ ప్లాంట్‍కు కేంద్రం సాయం చేసిందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు.

Update: 2025-01-23 12:04 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్‍కు కేంద్రం సాయం చేసిందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వం రూ.13,090 కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రైవేటీకరణ నుంచి స్టీల్‍ప్లాంట్‍ను మినహాయించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర ఉక్కుగనుల మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.

ఆర్థిక ప్యాకేజీని...
కేబినెట్ కమిటీలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని శ్రీనివాస వర్మ తెలిపారు. ప్యాకేజీ సాధనలో కుమారస్వామి, నిర్మలా సీతారామన్, చంద్రబాబు కృషి చేశారని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. విశాఖ స్టీల్‍ప్లాంట్‍ను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News