నేడు తిరుమల ఆలయం మూసివేత

సూర్య గ్రహణం కారణంగా నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 8.11 గంటలకు ఆలయాన్ని మూసివేశారు

Update: 2022-10-25 03:00 GMT

సూర్య గ్రహణం కారణంగా నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 8.11 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. రాష్ట్రంలోని ఆలయాలన్నీ ఈరోజు మూసి వేస్తారు. ఒక్క శ్రీకాళహస్తిలోని ఆలయం మాత్రం తెరచి ఉంటుంది. రాహుకేతుల పూజలు అక్కడ నిర్వహించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత తెరవనున్నారు. అనంతరం సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 69,278 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,660 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News