Tirumala : తిరుమలలో నేడు రద్దీ ఎంతంటే? ఈరోజు వెళితే మాత్రం...?

తిరుమలలో రద్దీ బాగా ఉంది. భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

Update: 2024-03-17 03:15 GMT

తిరుమలలో రద్దీ బాగా ఉంది. భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సహజంగా వీకెండ్ లో తిరుమలలో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈరోజు ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువయింది. దీంతో స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

బయట వరకూ క్యూ లైన్...
తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 36 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బయట ఏటీసీ వరకూ విస్తరించి ఉంది. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,351 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,164 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News