తిరుమల టిక్కెట్లు హాట్ కేకుల్లా సేల్ అయ్యాయిగా?

తిరుమల దర్శనం టిక్కెట్లు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.

Update: 2025-01-24 05:33 GMT

తిరుమల దర్శనం టిక్కెట్లు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను టీటీడీ చేసింది.ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటానుఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

గదుల కోటా విడుద‌ల‌…
తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌ కూడా నేడు చేయనుంది. నేటి మధ్యహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తారీఖున శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాలు ఉదయం 11గంటలకు, మధ్యాహ్నం12 మరియు మ. 1గంటలకి యధాప్రకారం విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.


Tags:    

Similar News