ఫస్ట్ టైం ఎమ్మెల్యేలూ.. రావెలను చూసి నేర్చుకోండయ్యా?

తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వారు రావెల కిశోర్ బాబును చూసి తమ నడవడికను మార్చుకోవాలి

Update: 2025-06-30 09:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి పార్టీల నుంచి అనేక మంది కొత్త వారు ఎన్నికయ్యారు. దాదాపు ఎనభై మందికి పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వారున్నారు. అయితే వీరు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును చూసి నేర్చుకోవాలి. అలాగే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వారు సయితం రావెల కిశోర్ బాబును చూసి తమ నడవడికను మార్చుకోవాలి. ఎందుకంటే రావెల కిశోర్ బాబు రాజకీయ జీవితం కొత్తతరం నేతలకు ఒక పాఠంగా చెప్పొచ్చు. ఎలా ఉండకూడదో ఆయనను చూసి నేర్చుకోవాలి. గెలుపు తర్వాత గర్వం తలెకెక్కితే రావెలకు పట్టిన గతి భవిష్యత్ లో పట్టక తప్పదన్నది ఆయనను చూసి నేర్చుకోవాలి.

2014లో రాజకీయాల్లోకి వచ్చి...
2014లో రావెల కిశోర్ బాబు రాజకీయ రంగంలోకి కాలు మోపారు. మచి టైం చూసుకుని ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సామాజికవర్గం కోణంలో రావడంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్తిపాడు టిక్కెట్ ను కొట్టేశారు. తొలి ఎన్నికలోనే గెలుపు రుచి చూశాడు. దానికి తోడు ఐఆర్ఎస్ మాజీ అధికారి కావడంతో 2014మంత్రివర్గంలో చంద్రబాబు రావెల కిశోర్ బాబుకు తన కేబినెట్ లో చోటు కల్పించారు. కుదురుగా ఉండాల్సిన రావెల గెలుపు తర్వాత మైండ్ సెట్ మారిపోయింది. ఇక నియోజకవర్గంలో తనకు తిరుగు లేదని భావించారు. ప్రజలు తన వద్దకు వచ్చి మోకరిల్లడంతో పాటు కార్యకర్తలు తన వెంట తిరుగుతుండటాన్ని బలహీనతగా భావించి కష్టాలను కొని తెచ్చుకున్నారు.
పార్టీలు మారినా..?
ఫలితంగా మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తర్వాత 2022 లలో భారతీయ జనతా పార్టీలో చేరారు. తర్వాత 2024 ఎన్నికలకు ముందు రావెల కిశోర్ బాబు బీజేపీకి రాజీనామాచేసి వైసీపీలో చేరిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2024లో వైసీపీ ఓటమి పాలు కావడంతో కొన్నాళ్ల నుంచి ఆయన కనిపించడం లేదు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఇలా దాదాపు అన్నిపార్టీలను చుట్టివచ్చిన రావెల కిశోర్ బాబు 2014 లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వేసినతప్పటుడుగులతో ఇప్పటి వరకూతిరిగి కోలేదు. ఆయన కెరీర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు కేస్ స్టడీస్ గా చెప్పాలి.


Tags:    

Similar News