వల్లభనేని వంశీ అరెస్ట్ పై సోమిరెడ్డి ఏమన్నారంటే?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వల్లభనేని వంశీ అని ఆయన అన్నారు. అలాంటి అరాచక శక్తిని శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని తెలిపారు. వంశీతో పాటు మరో ఐదు మృగాలు కూడా ఊచలు లెక్కపెట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
జంతువులను శిక్షిస్తేనే...
వల్లభనేని వంశీ వంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాంటి జంతువులను శిక్షించడమే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఫోన్లు చేసి అల్లర్లకు పాల్పడాలంటూ తన అనుచరులకు చెప్పారని, వైసీపీ నేతల నైజం బయటపడిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.