మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ భేటీ

మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. కమిటీలోని ఇరవై మంది సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

Update: 2022-02-01 07:29 GMT

మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. స్టీరింగ్ కమిటీలోని ఇరవై మంది సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మంత్రుల కమిటీ నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వంతో చర్చలకు నిన్న ఆహ్వానించడంతో ఈరోజు స్టీరింగ్ కమిటీ భేటీ అయింది.

అంతకు ముందు....
పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. గతంలో పెట్టిన మూడు ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ముందు ఉంచాలని నిర్ణయించింది. ఇతర ఆర్థికపరమైన ప్రతిపాదనలను పెడితే మరోసారి స్టీరింగ్ కమిటీ చర్చించాలని నిర్ణయించింది. గతంలో ప్రభుత్వానికి చెప్పినట్లు కొత్త పీఆర్సీ జీవో ను రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని, ఈ నెల పాత జీతాలను చెల్లించాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలను ఉంచింది. పీఆర్సీ సాధన సమితి సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు నేతలు సంఘీభావం తెలిపారు.


Tags:    

Similar News