సమ్మె బాటలోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు

తాజాగా ఈ సమ్మెకు ఏపీ ఆర్టీసీ యూనియన్ సంఘాలు మద్దతు తెలిపాయి. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు

Update: 2022-01-22 09:58 GMT

ఏపీ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సమ్మెకు ఏపీ ఆర్టీసీ యూనియన్ సంఘాలు మద్దతు తెలిపాయి. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలుపుతూ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వారు కూడా సమ్మెలోకి వెళ్లనున్నాయి. అయితే.. పెద్ద యూనియన్ సంఘాలే మద్దతు తెలపడంతో భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కానున్నారు.

కాగా.. ఈ సమ్మెపై జనవరి 22వ తేదీ ఆదివారం రాష్ట్ర సీఎస్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. గతంలో ఆర్టీసీ ఎన్నివేల కోట్ల నష్టాల్లో ఉన్నా.. ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు వచ్చేవని, ఇప్పుడు 2 నుంచి 7, 9 తేదీల్లోపు జీతాలు పడుతున్నాయని తెలిపారు. కానీ.. 8 శాతం హెచ్ఆర్ఏ పెట్టాక జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెప్తుందో అర్థం కావట్లేదన్నారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News