నేడు మాధవ్ బాధ్యతల స్వీకరణ
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మాధవ్ కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారు. ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో పదవీ బాధ్యతల స్వీకరించనున్నారు.
ర్యాలీగా వెళ్లి...
తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు మాధవ్ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో కలసి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్న మాధవ్ అనంతరం బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకుని అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.