నిండుకుండలా నీటి ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీ వరద నీరు చేరింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు అధికంగా చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్‌కి వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,82,710 క్యూసెక్కులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 15.2 అడుగులు కాగా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాగర్ ప్రాజెక్టు వద్ద...
మరొక వైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు పోటెత్తుతుంది. 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 5 అడుగుల మేర పైకి ఎత్తి 88791 క్యూసెక్కులు నీటినీ దిగువకు నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో 186276 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 120901 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన నీరు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇన్ ఫ్లో డ్యామ్ లో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 590అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీ లుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు గా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.