బుద్దావెంకన్న అరెస్ట్

మంత్రి కొడాలి నాని, డీజీపీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

Update: 2022-01-24 12:52 GMT

టీడీపీ నేత బుద్దా వెంకన్న ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొడాలి నాని, డీజీపీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. బుద్దా వెంకన్న అరెస్ట్ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు కొంత అడ్డుతగిలినా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగింది.

సీరియస్ కామెంట్స్.....
మంత్రి కొడాలి నాని విషయంలో ఈరోజు ఉదయం బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాసినో విషయంలో డీజీపీకి ఎంత ముడుపులు ముట్టాయని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి తలుపు తడితే కొడాలి నానిని చంపేస్తానని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సీరియస్ కామెంట్స్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 153A, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..


Tags:    

Similar News