Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2018లో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోని తన 'ఎక్స్' ఖాతాలో మంత్రి నాదెండ్ల మనోహర్ షేర్ చేశారు. ఏడేళ్ల క్రితం తాను పవన్ కల్యాణ్ తో కలసి పాల్గొన్న కార్యక్రమం ఫొటోను కూడా అందుకు జత చేశారు. యువత తో మాట్లాడుతూ నాడు ఇద్దరు కలసి ఫొటోను షేర్ చేశారు.
నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ ను...
అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ పోస్టుని ట్యాగ్ చేస్తూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలుచేశారు. 'ఏపీలో యువత ఉచిత పథకాలు అడగడం లేదు.. సంక్షేమ పథకాలు అడగడం లేదు.. 25 సంవత్సరాల భవిష్యత్తును అడుగుతున్నారు' అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారు. ఎక్స్ లో పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.