Pawan Kalyan : పవన్ కు శత్రువులు ఎవరో కాదు.. మిత్రులేనట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుల్లోనే శత్రువులు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎదగలేని వారు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

Update: 2025-09-26 09:03 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుల్లోనే శత్రువులు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎదగలేని వారు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తన సొంత నియోజకర్గం పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వెనక అదృశ్యశక్తి ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ స్పందిస్తారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో నియోజకవర్గంలో తక్కువగానే పర్యటిస్తుంటారు. తనకు బదులు ఫైవ్ మెన్ కమిటీని నియమించిన జనసేనాని టీడీపీ, జనసేన పార్టీలో గ్రూపు విభేదాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే తాజాగా ఉప్పాడ తీరంలో మత్స్యకారులు రోడ్డెక్కడం వెనక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సమస్య ఏంటంటే.. తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల వల్ల ఉప్పాడ తీరంలో మత్స్యసంపదను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

మత్స్యకారుల ఆందోళనల వెనక...
రసాయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్య జలాలతో మత్స్య సంపద కనుమరుగవుతుందనిఅంటున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని, పవన్ కల్యాణ్ వచ్చేంత వరకూ తాము ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అయితే వచ్చే నెలపదో తేదీన తాను వచ్చి కలుస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో వారు తాత్కాలికంగా ఆందోళనను విరమించినప్పటికీ ఈ ఆందోళనలు మత్స్యకారులు చేయడానికి వెనక ఒక టీడీపీ నేత ప్రమేయం ఉందని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు చేరవేసినట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ పర్యావరణ, కాలుష్య నియంత్రణ వంటి విభాగాలకు మత్రి కావడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈ ఆందోళనలకు మత్స్యకారులను ఆ టీడీపీ నేత రెచ్చగొట్టారంటున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆందోళనలు వెనక...
తనపై ఉన్న ఆగ్రహంతో పాటు జనసేన ను బలహీనం చేయాలన్న ఆలోచనతో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ వర్గీయులు ఈ ఆందోళనల వెనక ఉన్నారని జనసేన నేతలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను డీ ఫేమ్ చేయడానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు ఈ రకమైన స్ట్రాటజీని ప్లే చేస్తున్నారంటున్నారు. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ తాను నేరుగా వచ్చి సమావేశం అవ్వడమే కాకుండా కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ కమిటీలో స్థానిక మత్స్యకార ప్రతినిధులకు కూడా చోటు కల్పిస్తామని తాత్కాలికంగా ఆందోళనను విరమించే ప్రయత్నంచేసినా భవిష్యత్ లో ఇలా ఎన్ని రకాలుగా పవన్ కల్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం జరుగుతాయని, మిత్రులుగానే ఉంటూ ఈ పనికి పాల్పడుతున్న వారిపై ఒక కన్నేసి ఉంచాలని జనసేన పార్టీ నేతలకు చెప్పారని తెలిసింది.


Tags:    

Similar News