Ontimitta : నేడు ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణం

నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం జరగనుంది.

Update: 2024-04-22 05:33 GMT

నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం జరగనుంది. ఈరోజు సాయంత్రం 6.30 గంట నుంచి 8.30 గంటల వరకూ కల్యాణోత్సవం జరగనుంది. ఒంటిమిట్ట రామాలయంలో పౌర్ణమికి సీతారాముల కల్యాణం జరుగుతుండటం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే సీతారాముల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయిన నేేపథ్యంలో ఒంటిమిట్ట రామాలయాన్ని సుందరంగా అలంకరించారు. ఏటా పౌర్ణమి రోజు రాత్రి స్వామి వారికి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది.

వాహనాల దారి మళ్లింపు...
సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు పెద్దయెత్తున భక్తులు తరలి రానున్నారు. దీంతో కడప - తిరుపతి వెళ్లే దారిలో వాహనాలను దారి మళ్లించారు. భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు కల్యాణోత్సవం తర్వాత రేపు రథోత్సవం నిర్వహిస్తారు. 26న చక్రస్నానంతో ఉత్సవాలను ముగించనున్నారు. ఈరోజు కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తుల అధిక సంఖ్యలో వస్తారని భావించి ప్రత్యేకంగా పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News