జీవీఎల్ vs పురంద్రీశ్వరి... కొత్త వివాదం

బీజేపీలో కొత్త వివాదం తలెత్తింది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-02-17 07:52 GMT

ఏపీ బీజేపీలో కొత్త వివాదం తలెత్తింది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి కౌంటర్ ఇచ్చారు. నిన్న జీవీఎల్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో రెండు కుటుంబాలకే ప్రాముఖ్యత ఉందన్నారు. అన్ని పథకాలకు వైఎస్సార్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే పెడతారా? అని ప్రశ్నించారు. వారి పేర్లు పెట్టినప్పుడు వంగవీటి మోహనరంగా పేరు ఎందుకు పెట్టలేదో స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇద్దరూ మహా నేతలే...
అయితే రాజ్యసభ సభ్యుడు జీవీ‌ఎల్ నరసింహారావుకు మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు అందించారన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ, 108 సేవలతో పాటు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పేదల కోసం తెచ్చారని పురంద్రీశ్వరి చెప్పారు. అలాంటి మహనీయుల పేర్లు పెడితే తప్పేమిటని పురంద్రీశ్వరి ప్రశ్నించారు.


Tags:    

Similar News