Nara Lokesh : ఆస్ట్రేలియాలో నారా లోకేశ్ పర్యటన ఇలా
ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతుంది.
ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతుంది. విశాఖలో నవంబరు లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు రావాలంటూ ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. పలు సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. కొన్ని ఒప్పందాలను కూడా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున చేసుకున్నారు.
పెట్టుబడులకు...
నారా లోకేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌ను సందర్శించారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. క్వాంటం టెక్నాలజీ రీసెర్చ్‌కు సహకారం అందించాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.