Nara Lokesh : నేడు రెన్యూ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన
అనంతపురం జిల్లాలో నేడు రెండో రోజు లోకేశ్ పర్యటిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో భారీ పరిశ్రమకు లోకేశ్ నేడు శంకుస్థాపన చేయనున్నారు
అనంతపురం జిల్లాలో నేడు రెండో రోజు లోకేశ్ పర్యటిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో భారీ పరిశ్రమకు లోకేశ్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. మొత్తం మూడు రోజుల పర్యటనలో నేడు గుంతకల్లు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు.
22 వేల పెట్టుబడితో...
దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు రెన్యూ ప్రాజెక్టు ఏపీకి వచ్చింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమతో వేలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించాయి. రెన్యూ ప్రాజెక్టు కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో అనంతపురం జిల్లా వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.