Andhra Pradesh : ఆస్ట్రేలియాలో నారా లోకేశ్ పెట్టుబడుల వేట

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటన కొనసాగుతుంది

Update: 2025-10-21 07:42 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటన కొనసాగుతుంది. పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని నారా లోకేశ్ ఈ సందర్భంగా కోరారు.

పెట్టుబడులు పెట్టేందుకు...
న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్ ను ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఇన్నోవేషన్ స్టార్టప్ హబ్ లతో అనుసంధానించే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా అడిగార. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని, సముద్ర తీరంతో పాటు ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని నారా లోకేశ్ ప్రకటించారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రతినిధులను పంపాలని నారా లోకేశ్ కోరారు.


Tags:    

Similar News