Nara Lokesh : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు భారీ ఊరట దక్కినట్లయింది. భారత్ కు చెందిన రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా వైట్ స్పాట్ వైరస్ కారణంగా మన రొయ్యలపై ఉన్న అడ్డంకులు ఈ నిర్ణయంతో తొలగిపోయినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఆక్వా రైతులకు...
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ ఈ గుడ్ న్యూస్ ను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. "భారత రొయ్యల దిగుమతికి తొలిసారిగా ఆమోదం లభించింది. ఇందుకు విశేషంగా కృషి చేసిన భారత, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు" అని ఆయన తెలిపారు. కేవలం ఒకే మార్కెట్‌పై ఆధారపడకుండా, నూతన మార్కెట్లను అన్వేషించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.