గుజరాత్ కు మంత్రి నారాయణ బృందం
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గుజరాత్ కు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేరుకున్నారు
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గుజరాత్ కు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేరుకున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్లిన మంత్రి నారాయణ,అధికారులు స్టడీ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించనున్న మంత్రి,అధికారులు అనంతరం ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు.
అధ్యయనం చేయడానికి...
అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహం అధ్యయనం చేయనున్న మంత్రి బృందం ఈ మేరకు ఒక నిర్ణయానికి రానుంది. మధ్యాహ్నం 2.30 కి అహ్మదాబాద్ శివారులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ని పరిశీలించనున్న మంత్రి సాయంత్రం 6 గంటలకు అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీని మంత్రి నారాయణ బృందం సందర్శించనుంది.