Kanna :జగన్ నువ్వు మారవా? కన్నా ధ్వజం
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్టు ఉందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. రెంటపాళ్ళ నాగమల్లేశ్వరరావు మరణానికి నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు.పోలీసుల వేధింపుల వల్ల కాదు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే నాగమల్లేశ్వరరావు చనిపోయారు అని కన్నా స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రకు వెళ్తుంటే నీకు గజమాలలు, సన్మానాలేంటి?పరామర్శలు కు వెళ్ళావా, సన్మానం చేపించుకోవడానికి వెళ్ళావా..? అని కన్నా ప్రశ్నించారు.
చంపుతాం.. నరుకుతాం...
వైసీపీ కార్యకర్తలు చంపుతాము, నరుకుతాము అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించిన తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ ఉన్మాదులు చేస్తున్న అరాచకం ఇది అని మండిపడ్డారు. "2029లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రప్ప రప్ప నరుకుతాము అని ప్లకార్డులు ప్రదర్శించడం దేనికి సంకేతం?" అని కన్నా నిలదీశారు. అధికారం ఉన్నా, లేకపోయినా జగన్ ప్రవర్తన మారలేదని, అదే "రాక్షస ప్రవర్తన" అని కన్నా విమర్శించారు.