ఈసారి హిందూపురం మాదే : పెద్దిరెడ్డి
హిందూపురంలో ఈసారి వైసీపీ విజయం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
minister peddireddy ramachandra reddy
హిందూపురంలో ఈసారి వైసీపీ విజయం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని బాలకృష్ణను రెండుసార్లు ప్రజలు గెలిపించారని, అయితే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 99 శాతం మంది లబ్దిదారులకు పథకాలను అందించామని చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు.
బాబుకు అభ్యర్థులేరీ?
ఈసారి హిందూపురంలో ఒక బీసీ మహిళకు సీటు కేటాయించడంతో అందరూ వైసీపీ వైపు చూస్తున్నారన్నారు. రెండుసార్లు తాము గెలవలేకపోయాం కాబట్టి, తప్పొప్పులను బేరీజు వేసుకుని ఇక్కడ బరిలోకి దిగుతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పార్టీలో నెలకొన్న సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు వెళతామని ఆయన అన్నారు. కుప్పంలో గెలుపుపై అనుమానం వచ్చినందునే ఆయన రెండుచోట్ల పోటీ చేస్తారంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీలో సరైన అభ్యర్థులే లేరని ఆయన అన్నారు.