ఉద్యోగులకు ఇది పద్ధతి కాదు.. బొత్స తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ ఉద్యో్గులు అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు

Update: 2022-01-28 08:25 GMT

ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమేనని, కానీ పీఆర్సీ విషయంలో వారు రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తమ కమిటీతో చర్చలు జరిపిందన్నారు. వారు లేవనెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పుడు కదా తెలిసేది.....
కొత్త పీఆర్సీ కారణంగా తమ జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని, అయితే జీతం అందుకుంటే కదా? పెరిగేది? తగ్గేది తెలిసేది అనేది బొత్స సత్యనారాయణ అన్నారు. చర్చలకు రాకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చలకు వారు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు అర్ధం చేసుకోకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పరోక్షంగా ఉద్యోగ సంఘాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News