రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు జరిగినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు

Update: 2025-02-03 11:51 GMT

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు జరిగినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేబడ్జెట్‌లో ఏపీకి రికార్డ్ స్థాయి కేటాయింపులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు 9,417 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే తెలంగాణకు 5,337 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించామని చెప్పారు. కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్న ఆయన ఇప్పటి వరకు తెలంగాణకు 41,677 కోట్లు మంజూరు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

త్వరలో వందేభారత్ రైళ్లు...
త్వరలో తెలంగాణకు నమో భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు వస్తాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 84,559 కోట్ల రూపాయల విలువైన పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామన్న ఆయన 1560 కిలో మీటర్ల కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ లో అధిక కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయితే అనేక సౌకర్యాలు ప్రయాణికులకు సమకూరుతాయని చెప్పారు.


Tags:    

Similar News