Weather Report : ఇదేమి గండాలు సామీ.. ఇంకెన్ని వాయుగుండాలున్నాయో?

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది

Update: 2025-11-20 04:18 GMT

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. తెలంగాణలోనూ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 24 వతేదన వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఈకారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 9.8, పటాన్‌చెరులో 10.2 డిగ్రీలు., రాజేంద్రనగర్‌లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో వానలు...
ఆంధ్రప్రదేశ్ లో వానలు పడతాయని విశాఖవాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ జిల్లాలో పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావం కారణంగానూ, వాయుగుండంగా ఏర్పడటం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ వాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశముందని కూడా తెలిపింది. రెండు రోజుల పాటు వానలుపడతాయని పేర్కొంది.
మరో రెండు రోజులు...
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, ఆసిఫాబాద్ కుమ్రభీం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కోహీర్‌లో 7.8 డిగ్రీలు, నార్లాపూర్‌లో 9.5 డిగ్రీలు, సింగిల్‌ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చలి గాలుల తీవ్రత నుంచి తమను తాము కాపాడుకుంటూ ఆరోగ్యపరంగా రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News