మరో అల్పపీడనం... రెడీ అవ్వండి
ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది
ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 9.8, పటాన్‌చెరులో 10.2 డిగ్రీలు., రాజేంద్రనగర్‌లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
చలిగాలుల తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ జిల్లాలో పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కోహీర్‌లో 7.8 డిగ్రీలు, నార్లాపూర్‌లో 9.5 డిగ్రీలు, సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.