Weather Report : రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు అలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 27వ తేదీనాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశా వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావవంతో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.