డోకిపర్రు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన చిరంజీవి దంపతులు

కృష్ణాజిల్లా డోకిపర్రులోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సతీసమేతంగా విచ్చేశారు. శుక్రవారం రాత్రి భార్య సురేఖతో కలిసి ఆలయానికి

Update: 2022-01-15 13:42 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి పండుగను అటు ఫ్యామిలీ, ఇటు అభిమానులతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్న ఉదయం ఫ్యామిలీ కలిసి భోగి సంబరాలు చేసుకున్న మెగాస్టార్.. ఆ తర్వాత రవితేజ న్యూ మూవీ రావణాసుర ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. రాత్రికి డోకిపర్రులో ప్రత్యక్షమయ్యారు. శుక్రవారం కృష్ణాజిల్లా డోకిపర్రులోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సతీసమేతంగా విచ్చేశారు. శుక్రవారం రాత్రి భార్య సురేఖతో కలిసి ఆలయానికి విచ్చేసిన చిరంజీవికి.. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో గోదా కల్యాణాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. మేఘా కన్స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆయన సొంతూరు కృష్ణా జిల్లా డోకిపర్రులో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. అప్పటి నుంచి ఆ ఆలయం పుణ్యక్షేత్రంగా మారింది. ఇక్కడే పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రజలు డోకిపర్రుని పుణ్యక్షేత్రంగా భావిస్తారు. కాగా.. చిరంజీవి వచ్చారని తెలిసి.. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.


Tags:    

Similar News